మాఖిల్ బిన్ యసార్ రజియల్లాహు అన్హు మర్ఫూ ఉల్లేఖనం‘ అల్లాహ్ తాలా ఎవరికైతే నాయకత్వాన్ని ఒసగుతాడో అతని మరణ సమయానికి కనుక అందులో ఏమైనా మోసానికి అన్యాయానికి పాల్పడితే అతనిపై స్వర్గం నిషేదించబడుతుంది.
అబూహురైర రదియల్లాహు అన్హు కథనం మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ భోదించారు:ఎవరైతే అమీర్ విధేయతకు విముఖత చూపుతూ జమాత్ నుండి వైదొలగి చనిపోతాడో అతను అజ్ఞానం చావు చచ్చినట్లు, మరియు ఎవరైనా గుడ్డిగా మరొకరి పతాకం క్రింద పోరాడినా, కోపంగా అసహనముతో వ్యవహరించిన,లేదా అసహనము వైపుకు పిలుపునిచ్చినా లేదా మతోన్మాదానికి మద్దతు ఇచ్చి పిదప చంపబడితే,ఈ హత్య అజ్ఞానకాలం యొక్క హత్యకు సమానం అవుతుంది,మరెవరైతే నా జాతి ప్రజలపై తిరుగుబాటు చేసి మంచి చెడు తేడా లేకుండా ముస్లిములని వదలకుండా,ఒప్పందం లో ఉన్న వారు అని చూడకుండా అందరినీ హతమార్చినట్లైతే అలాంటి వాడితో నాకు ఎలాంటి సంబంధం లేదు నాకు అలాంటి వాడితో ఎలాంటి సంభందం లేదు”