ఉమర్ బిన్ అల్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు మర్ఫూ ఉల్లేఖనం ‘నిశ్చయంగా కార్యాలు ,కర్మలు వాటి సంకల్పాలపై ఆధారపడి ఉంటాయి ‘ప్రతీ వ్యక్తికి అతని సంకల్పానుసారంగా ప్రతిఫలము లభిస్తుంది,అల్లాహ్ మరియు దైవప్రవక్త కొరకు హిజ్రత్ చేస్తే అతని హిజ్రత్ అల్లాహ్ మరియు దైవప్రవక్త వైపుకు వ్రాయబడుతుంది,మరెవరైతే ప్రాపంచిక సొమ్ముకోసం హిజ్రత్ చేస్తాడో అతనికి అది లభిస్తుంది లేదా ఒకఅమ్మాయిని వివాహమాడుటకు వలస పోతే ,అతను సంకల్పించిన ప్రకారంగా ఆ హిజ్రత్ నమోదుచేయబడుతుంది
అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు మర్ఫూ ఉల్లేఖనం"ఎవరి(చేతిలో)ఆదీనంలో ముహమ్మద్ ప్రాణం ఉందో ఆయన సాక్షిగా"ఈజాతిలోని యూదుడైన క్రైస్తవుడైనా,ఇంకెవరైనాసరే నాకు ఇచ్చి పంపించ బడ్డదాన్ని(ఖుర్ఆన్)అనుసారంగా విశ్వసించక పూర్వమే మరణిస్తే అతను నరకాగ్నిలోకి ప్రవేశిస్తాడు"
అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు కథనం మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ మరియు ఆయనతో పాటు వెనుక ముఆజ్ బిన్ జబల్ రజియల్లాహు అన్హు ఒకే ఒంటె పై ప్రయాణిస్తున్నారు,ప్రవక్త ‘ఓ ము ఆజ్’అని పిలిచారు,నేను లబ్బైక్ వ సఅదైక్(హాజరయ్యను) ఓ మహా ప్రవక్త అని చెప్పాను,ప్రవక్త మళ్ళీ ‘ఓ ముఆజ్’అని పిలిచారు నేను ‘లబ్బైక్ వ సఅదైక్ అని బదులిచ్చాను,మూడు సార్లు ఇలా జరిగింది,ఏ దాసుడైతే ‘అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వ అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసులుహూ’అని అంతఃకరణ శుద్దితో సాక్ష్యమిస్తాడో అతనిపై మహోన్నతుడైన అల్లాహ్ నరకాగ్ని ని నిషేదిస్తాడు అనిసెలవిచ్చారు-ముఆజ్ చెప్తూ –ఓ దైవప్రవక్త ! ఈ శుభవార్తను నేను ప్రజలందరికీ తెలియజేయాలా వారు ఎంతో సంతోషిస్తారు?అని అడిగాను,దైవప్రవక్త బదులిస్తూ – అలా అయితే వారు కేవలం దానిపై మాత్రమే ఆధార పడిపోతారు’అని చెప్పారు,ముఆజ్ రజియల్లాహు అన్హు ఈ విషయాన్ని తన మరణ సమయపు అంతిమఘడియల్లో (జ్ఞానం దాచడం)పాపం కాకూడదని తెలియజేశారు.
అబుజర్ర్ అల్ గిఫ్ఫారీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ‘మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ ప్రభువు అల్లాహ్ నుండి ప్రభోదిస్తున్న ప్రవచనం-‘ ఓ నా దాసులరా! నేను నాపై హింసను నిషేదించుకున్నాను,అలాగే మీకొరకు కూడా దాన్ని నిషేదించాను,పరస్పరము హింసించుకోకండి దౌర్జన్య పడకండి, ఓ నా దాసులరా! నిశ్చయంగా నేను కోరినవారు తప్ప మిగతావారంతా మార్గబ్రష్టులే కాబట్టి నాతో సన్మార్గాన్ని వేడుకోండి నేను మీకు సన్మార్గమును ప్రసాదిస్తాను,ఓ నా దాసులారా నేను తినిపించిన వారు తప్ప మీరంతా ఆకలిగొన్నవారు కాబట్టి నన్ను అర్ధించండి నేను తినిపిస్తాను ,ఓ నా దాసులారా నేను తొడిగించిన వారు తప్ప మిగతా వారంతా నగ్నులే కాబట్టి వస్త్రాలను ప్రసాదించమని నన్ను అడగండి నేను మీకు వస్త్రాధారణ చేస్తాను,ఓ నా దాసులారా మీరు రేయింబవళ్లు పాపాలు చేస్తున్నారు నేను మీ పాపాలన్నీ క్షమిస్తున్నాను కాబట్టి నాతో పాప పరిహారము వేడుకోండి నేను మీ పాపాలను ప్రక్షాళిస్తాను,ఓ నా దాసులారా మీరు నాకు లాభనష్టాలు చేకూర్చలేరు,ఓ నా దాసులరా!మీలోని మొదటివాడు చివరివాడు మీ మనుషులు మీ జిన్నాతులు అందరూ కలిసి మీలోని అతిభీతిభయభక్తి కలవాడుగా మాదిరిగా మారిపోయినా అల్లాహ్ సామ్రాజ్యం లో ఒక్కబిందువైన తేడా రాదు, ఓ నా దాసులరా!మీలోని మొదటివాడు చివరివాడు మీ మనుషులు మీ జిన్నాతులు అందరూ కలిసి ఒక పర్వతం పై నిలబడి నన్ను అర్ధించినట్లైతే నేను అందులోని ప్రతీ ఒక్కరికీ వారి అవసరాన్ని తీర్చిన తరువాత కూడా నా వద్ద ఉన్న దాంట్లో కొంచెం కూడా తరగదు,ఒక సూది ని సముద్రం లో ముంచి తీస్తే ఎంత తరుగుతుందో అంతే తరుగుతుంది,ఓ నా దాసులారా ఇవి మీరు చేసే కార్యాలు వాటిని నేను మీకోసం లెక్కిస్తున్నాను వాటి యొక్క పరిపూర్ణ ప్రతిఫలం మీకు నోసగుతాను,సత్ఫలితాన్ని పొందినవాడు అల్లాహ్ కు కృతజ్ఞత తెలుపుకోవాలి,ఎవరైతే దుష్కర్మల ప్రతిఫలం పొందుతాడో తన్ను తానే నిందించుకోవాలి.
అబూహురైర రజియల్లాహు అన్హు మర్ఫూ ఉల్లేఖనం “అల్లాహ్ మహోన్నతుడు,స్వాభిమానుడు,ఒక విశ్వాసి కూడా అభిమానవంతుడు అయి ఉంటాడు,అల్లాహ్ నిషిద్దపర్చిన (హరామ్)విషయము విశ్వాసి చేసినప్పుడు అల్లాహ్ కు రోషం వస్తుంది
అనస్ బిన్ మాలిక్ మరియు అబూ హురైర రజియల్లాహు అన్హుమ మర్ఫూ ఉల్లేఖనం ‘మీలో ఎవ్వరూ కూడా ఆ క్షణం వరకు సంపూర్ణ విశ్వాసులు కాజాలరు కానీ నా పై వారికి తమ సంతానం కంటే తల్లితండ్రుల కంటే మరియు ప్రజలందరీ కంటే కూడా ఎక్కువ ప్రేమ ఉండాలి.
ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖిస్తూ తెలిపారు ‘మేము మహనీయ దైవప్రవక్త వద్ద కూర్చుని ఉన్నాము ,ఆ రోజు మా వద్దకి తెల్లని తెలుపు దుస్తులు ధరించి,నల్లని నలుపు వెంట్రుకలు కలిగి,ఎటువంటి ప్రయాణ ప్రభావం కనిపించని అపరిచిత వ్యక్తి వచ్చాడు వెళ్ళి మహనీయ దైవప్రవక్తకి దగ్గరగా మోకాళ్ళకు మోకాళ్ళు పెట్టి,తన చేతులు తొడలపై పెట్టుకుని కూర్చున్నాడు,పిదప ఓ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహివ సల్లమ్ ) ఇస్లాం అంటే ఏమిటి ? నాకు భోదించండి ? అంటూ అడిగాడు, మహనీయ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహివ సల్లమ్) బదులిస్తూ ‘ఇస్లాం అంటే ‘నువ్వు అల్లాహ్ తప్ప మరొక వాస్తవ ఆరాధ్యుడు లేడు మహనీయ ముహమ్మద్(సల్లల్లాహు అలైహివ సల్లమ్)అల్లాహ్ యొక్క ప్రవక్త మరియు సందేశ హరుడని సాక్ష్యమివ్వటం, నమాజులు ఆచరించడం,(స్తోమత ఉంటే )జకాతు చెల్లించడం,రమదాన్’మాసపు ఉపవాసాలు పాటించడం,ఒకవేళ నీకు వెళ్లగలిగే శక్తి, స్తోమత ఉంటే హజ్జ్ చేయడం అని చెప్పారు దానికి ఆ వ్యక్తి ‘ యదార్థం చెప్పారు’అన్నాడు ,మాకు ఆవిషయం ఆశ్చర్యం కలిగించింది అతను ప్రశ్నిస్తున్నాడు తరువాత జవాబును కూడా దృవీకరిస్తున్నాడు,మళ్ళీ ప్రశ్నిస్తూ ‘నాకు ఈమాన్ అంటే ఏమిటి చెప్పండి అని అడిగాడు,దానికి ప్రవక్త బదులిస్తూ ‘నువ్వు అల్లాహ్ ను, దైవదూతలను,ఆకాశ గ్రంధాలను,ప్రవక్తలను,మరియు పరలోకదినాన్ని విశ్వసించాలి,దాంతో పాటు విధివ్రాత మంచి ఐనా మరియు చెడుఐనా ను విశ్వసించాలి,అని చెప్పారు అతను ‘యదార్ధం చెప్పారు మీరు అన్నాడు ఆ పై ‘ఇహ్సాన్ ‘ అంటే ఏమిటి ప్రవక్తా అని ప్రశ్నించాడు ?నువ్వు అల్లాహ్ ను చూస్తున్నట్లుగా భావిస్తూ ఆరాధించు అది కాకపోతే అల్లాహ్ యే నిన్ను చూస్తున్నట్లు ఆరాధించు, అని తెలిపారు దానికి అతను ‘ప్రళయం గురించి భోదించండి’అని ప్రశ్నించాడు దానికి ప్రవక్త ‘ఎవరినైతే ఇది అడుగుతున్నావో ప్రశ్నిస్తున్న వాడి కంటే అతనికి ఈ విషయం లో ఎక్కువ జ్ఞానం లేదు ‘అన్నారు దానికి అతను అయితే ప్రళయ సూచనలు నాకు చెప్పండి అంటూ ప్రశ్నించాడు ‘ప్రవక్త బదులిస్తూ ‘ఒకటి ‘బానిసరాలు తన యజమానిని జన్మనిస్తుంది,రెండవ సూచన ‘నువ్వు చూస్తావు దుస్తులు లేని,కాళ్ళకు చెప్పులు లేని నగ్నులను,దరిద్రులు పెద్దపెద్ద భవనాలు నిర్మిస్తారు’పిదప ఆ వ్యక్తి వెళ్లిపోయాడు, చాలా సేపు నేను అక్కడే ఉన్నాను అప్పుడు ప్రవక్త ‘ ఓ ఉమర్ ! నీకు ఆ ప్రశ్నించిన వ్యక్తి ఎవరో తెలుసా ?అని అడిగారు దానికి నేను ‘అల్లాహ్ మరియు ప్రవక్త విజ్ఞులు ‘అన్నాను ఆయన చెప్తూ ‘నిశ్చయంగా అతను జీబ్రీల్ అలైహిస్సాలామ్ మీకు ధర్మాన్ని భోదించడానికి వచ్చారు అని తెలియజేశారు.
అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజియల్లాహు అన్హుమ కథనం మహానీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ మహోన్నతుడైన తన ప్రభువు తో ఉల్లేఖిస్తు తెలిపారు ‘‘నిశ్చయంగా అల్లాహ్ సత్కార్యాలను మరియు దుష్కార్యాలను వ్రాసేశాడు,తరువాత వాటిని స్పష్టపరచాడు,మంచిని సంకల్పించుకుని దాని పై కార్య సాధన చేయకున్నాఅల్లాహ్ తన వద్ద దానిని సంపూర్ణ పుణ్యంగా జమకడతాడు,ఒకవేళ సంకల్పంతో పాటు కార్య సాధన చేసినట్లైతే అతనికి అల్లాహ్ తన వద్ద పదిపుణ్యాల నుండి ఏడువందలకు పై రెట్టింపు పుణ్యాలుగా జమకడతాడు,ఒకవేళ చెడు సంకల్పించుకుని దానికి కార్యరూపం ఇవ్వనట్లైతే ఒకసంపూర్ణ పుణ్యాన్ని జమకడతాడు,ఆ కార్యాన్ని సంకల్పించుకుని కార్య సాధన చేస్తే మహోన్నతుడైన అల్లాహ్ దాన్ని కేవలం ఒక పాపంగానే పరిగణిస్తాడు’ముస్లిం ఉల్లేఖనం ప్రకారం ‘నాశనం వ్రాసి పెట్టి ఉన్నవారిని మినహాయించి ఏ ఒక్కరూ నష్టపోరు”
అబూ రుఖియా తమీమ్ బిన్ ఔస్ అద్దారి రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ‘మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ భోదించారు ‘ధర్మము అనగా సద్బుద్దితో వ్యవహరించడము అని అర్ధము”మేము‘ఎవరితో {సద్బుద్దితో వ్యవహరించడం} అని ప్రశ్నించాము?ఆయన ‘అల్లాహ్ తో ,ఆయన గ్రంధం తో ,ఆయన సందేశ హరులతో,ముస్లిం విశ్వాసుల నాయకులతో మరియు వారి ప్రజలతో అంటూ’ భోదించారు.
అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖనం మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లము ప్రవచించారు' నరకాగ్ని మనోవాంఛలతో మరియు స్వర్గము కష్టములతో కప్పియున్నది,(ముత్తఫఖున్ అలైహి)ఈ పదాలు బుఖారి ఉల్లేఖనం లోనివి,మరో ఉల్లేఖనం లో హుజీబత్ కు బదులు హుఫ్ఫత్ అని ఉంది,