ఆయెషా రజియల్లాహు అన్హా మర్ఫూ ఉల్లేఖనం’నిశ్చయంగా మోమిన్ తన మంచి నడవడిక ఉత్తమ సద్వర్తన వల్ల ఉపవాసికి మరియు తహజ్జుద్ చదివే వ్యక్తి యొక్క స్థానానికి చేరుకుంటాడు.
అబూ హురైర రజియల్లాహు అన్హు మర్ఫూ ఉల్లేఖనం’ఎవరైతే అల్లాహ్ పై మరియు పరలోక దినాన్ని విశ్వసిస్తాడో అతను మేలైన విషయాలు మాట్లాడాలి లేకపోతే మౌనంగా ఉండాలి,మరేవరైతే అల్లాహ్ ను మరియు పరలోక దినాన్ని విశ్వసిస్తాడో తన పొరుగువారిని అతను గౌరవించాలి, ఎవరైతే అల్లాహ్ ను మరియు పరలోక దినాన్ని విశ్వసిస్తాడో అతను తన అతిథిని గౌరవించాలి.
అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖనం మహనీయ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ ప్రవచించారు’ ఒకరికి డబ్బు దానం చేయడం వలన సంపదలో ఎలాంటి తరుగు జరుగదు,ఒకరిని మన్నించి వదిలిన వాడికి అల్లాహ్ గౌరవాన్ని నొసగుతాడు,శక్తిమంతుడైన మహొన్నతుడైన అల్లాహ్ కోసం వినమ్రతను పాటించేవాడికి అల్లాహ్ పురోగతిని ప్రసాదిస్తాడు’.