ముఆవియా బిన్ సుఫ్యాన్ రజియల్లాహు అన్హు కథనం మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ ప్రవచించారు’ ఎవరి పట్ల అల్లాహ్ మేలును కోరుకుంటాడో అతనికి ధార్మిక విధ్యను ప్రసాదిస్తాడు.
అబ్దుల్లా బిన్ అమ్ర్ బిన్ అల్ ఆస్ రజియల్లాహు అన్హుమ “మహనీయ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ ప్రవచించారు ‘నా నుండి విన్నది ఒక వాక్యమైన సరే ఇతరులకు చేర్చండి,ఇస్రాయీల్ సంతతి నుండి గ్రహించిన విషయాలు చెప్పండి చెప్పడంలో ఎలాంటి అనర్థము లేదు’ ఎవరైతే కావాలని నా పై అబద్దపు విషయాలను ఆపాదిస్తాడో అతను’నరకంలో తన’ నివాసాన్నిసిద్దం చేసుకుంటాడు.