నుమాన్ బిన్ బషీర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖిస్తూ తెలియపర్చారు ‘మహనీయ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ తెలియపర్చారు “నిశ్చయంగా హలాల్ స్పష్టపరచబడింది మరియు హరామ్ స్పష్టపరచబడింది,వాటికి మధ్య గల విషయాలు అనుమానాస్పదమైనవి ప్రజల్లోని చాలా మందికి వాటి గురించి సరైన జ్ఞానము లేదు,ఎవరైతే ఆ అనుమానాస్పద విషయాల నుండి భయబీతి కలిగి ఉంటారో తమ ధర్మం మరియు గౌరవం యొక్క రక్షణ పొందుతారు,మరెవవరైతే అనుమానాస్పద విషయాల్లో పడతారో హరామ్ కు గురి అవుతారు,ఒక గొర్రెల కాపరి కంచవద్ద తన పశువులను మేపుతున్నాడు అప్పుడు అవి ఆ కంచెను దాటి చేనులో మెసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి,తస్మాత్! జాగ్రత్త ప్రతీ రాజు కు ఒక కంచె నిర్దారించబడి ఉంటుంది,అల్లాహ్’నిర్దారించిన కంచె ఏమిటంటే "తాను హరాము పర్చిన విషయాలు", వినండి ! నిశ్చయంగా దేహం లో ఒక మాంసపు ముక్క ఉంది అది క్షేమంగా ఉంటే పూర్తి దేహం క్షేమంగా ఉంటుంది అదే కనుక పాడైతే సంపూర్ణ దేహం పాడైపోతుంది,అది మరేమీటో కాదు ‘హృదయము ‘అని తెలియపర్చారు.
జాబిర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం‘మహనీయ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ తెలిపారు క్రియవిక్రయాలు,లావాదేవీలు జరిపే సమయంలో,సందర్భానుసారంగా దయా హృదయంతో వ్యవహరించి క్షమించిన వ్యక్తిని అల్లాహ్ కరుణిస్తాడు.